శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (16:09 IST)

ప్రతిరోజూ ఒక కప్పు గ్రేప్స్ తీసుకుంటే నడుం నొప్పి..?

ప్రతిరోజూ ఒక కప్పు గ్రేప్స్ తీసుకుంటే నడుం నొప్పి దరిచేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నడుం కింది భాగంలో రక్తప్రసరణను పెంచే గుణాలు గ్రేప్స్‌లో పుష్కలంగా  ఉన్నాయి. కాబట్టి రోజూ కొన్ని గ్రేప్స్ తినేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే పైనాపిల్‌లో బ్రొమెలెన్ ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. అలాగే  వెల్లుల్లి, లవంగాలు, పసుపును ఆహారంలో చేర్చుకోవాలి. 
 
వెల్లుల్లి కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి పాయలను వేడి చేసి నొప్పి ఉన్న చోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం లభించాలంటే లవంగాలను తీసుకోవాలి. ఇక పసుపులో క్యురుక్యుమిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది యాంటీ ఇఫ్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి వుంటుంది.  ఇది ఛాతిలో మంటను తగ్గిస్తుంది.