శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (17:36 IST)

బరువు తగ్గాలా? అయితే రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీతో బరువు తగ్గడం చాలా సులభం. రెగ్యులర్‌గా గ్రీన్ టీని రెగ్యులర్‌గా తాగడం ద్వారా శరీరానికి తగినంత పానీయం అందుతుంది. తద్వారా దీర్ఘకాలంగా ఫ్యాట్‌పై ఫైట్ చేస్తుంది. 
 
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో పాటు ఒక పెద్ద గ్లాసుతో గ్రీన్ టీ తీసుకోవాలి. అంతే కాదు, ఇంకా కొంత స్టాక్ పెట్టుకొని రోజులో టీ త్రాగాలనిపించినప్పుడంతా గ్రీన్ టీ త్రాగండి. ఆకలేసినప్పుడల్లా గ్రీన్ టీ సేవించండి. డే టైమ్‌లో ఎక్కువగా, భోజనానికి ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత మరో కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల ఫ్యాట్‌ను బర్న్ చేస్తుంది.
 
గ్రీన్ టీ కార్బోహైడ్రేట్స్‌ను నిధానంగా విడుదల చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. గ్రీన్ టీ త్రాగినప్పుడు, బరువు పెరగడాన్ని నివారిస్తుంది. గ్రీన్ టీ త్రాగిన వెంటనే ఫ్యాట్ కణాల్లోకి షుగర్ చేరకుండా నివారిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే బాడీ ఫ్యాట్‌ను కరిగిస్తుంది.
 
స్నాక్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. స్నాక్స్ అండ్ ఆయిల్ ఫుడ్స్ తీసుకోని విధంగా చేస్తుంది. స్నాక్స్ తినాలనే కోరిక కలిగిన వెంటనే ఒక కప్పు గ్రీన్ టీని త్రాగండి. తద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.