శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (17:21 IST)

మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి!

మొక్కజొన్నతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.. అంటున్నారు వైద్యులు. మొక్కజొన్నను రెగ్యులర్‌గా తినడం వల్ల, తగిన పరిమాణంలో మితంగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్ (రక్తకాణాల ఆరోగ్యానికి) ఎంతో మేలు చేస్తుంది.

మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతే కాదు, రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
 
అలాగే మొక్కజొన్న ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని బీటా క్రిఫ్టాక్సన్తిన్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించేందుకు సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి కార్న్ చాలా మంచిది. మొక్క జొన్నలో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.
 
ప్రతి రోజూ తగు పరిమాణంలో కార్న్ తినడం వల్ల హెయిర్ ఫోలీ సెల్స్‌కు బలం చేకూరుతుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి, పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్‌గా ఉండేందుకు, మంచి షైనింగ్ పొందడానికి బాగా సహాయపడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.