శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (19:42 IST)

మామిడి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందట!

మామిడి పండ్లు రుచిలోనే కాదు, ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన పలు విలువైన అంశాలు దాగున్నాయి. ముఖ్యంగా మామిడిపండులో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇందులోని ప్రకృతిపరమైన ఫ్రీ రాడికల్స్ గుండెకు సంబంధించిన పలు జబ్బులు, క్యాన్సర్ తదితర జబ్బులతో పోరాడేందుకు సిద్ధపడతాయని పరిశోధకులు తెలిపారు.  
 
* మామిడి పండులో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే గుణాలే కాకుండా శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా ఉంది. ఎనీమియా(రక్తలేమితో బాధపడేవారు)తో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలకు మామిడిపండు ఎంతో ఉపయుక్తమైనదిగా చెప్పుకుంటారు. కాని మామిడిపండును ఆహారంగా తీసుకోవాలనుకునే గర్భిణీ స్త్రీలు వైద్యుడిని సంప్రదించి తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
* శరీర చర్మంపై ఏర్పడే పొక్కులకు మామిడిపండు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. మామిడి పండును ముక్కలుగా తరిగి ఆ ముక్కలను పొక్కులున్నచోట పది నిమిషాలపాటుంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. దీంతో పొక్కులు మటుమాయమౌతాయంటున్నారు వైద్యులు. 
 
* అజీర్తితో బాధపడే వారు మామిడిపండును ఆహారంగా తీసుకుంటే అజీర్తి మటుమాయమై ఆకలి బాగా వేస్తుందంటున్నారు వైద్యులు. అలాగే అజీర్తితో అసిడిటీ కూడా కొందరికి వేధిస్తుంటుంది. ఇలాంటి వారు మామిడి పండును తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
 
* మామిడిపండులో అధిక పొటాషియం ఉండటంతో అధిక రక్తపోటును అదుపులోవుంచుతుంది. అలాగే ఇందులోనున్న పీచుపదార్థం కారణంగా శరీర రక్తంలోనున్న కొవ్వును నియంత్రిస్తుంది. 
 
* అలాగే కొందరు బలహీనులుగా ఉంటారు. ఇలాంటి వారు మామిడి పండ్ల సీజన్‌లో ప్రతి రోజు ఓ పండును ఆహారంగా తీసుకుంటుంటే బరువు పెరగడంతోపాటు శారీరకంగాను అందంగా, పుష్టిగా తయారవుతారు. 
 
* అలాగే మూత్రపిండాలలో రాళ్ళున్న వారు మామిడిపండ్లు తీసుకుంటుంటే రాళ్ళు కరిగిపోతాయని చైనా పరిశోధకులు తెలిపారు. మామిడిపండ్లలో తీపు, పులుపుతోపాటు శక్తివంతమైన పలు పోషకపదార్థాలున్నాయి. దీంతో జ్వరం, బలహీనత, దగ్గు, రక్తలేమి తదితర జబ్బులు తగ్గిపోతాయి. 
 
* విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంపొందించడంలోను ఈ మామిడిపండు ఎంతో ఉపయోగపడుతుంది. కొందరు విద్యార్థులకు చదువుకునే సమయంలో అనారోగ్యకరమైన చిప్స్, మార్కెట్లో లభించే ముందుగా తయారు చేసిన ఆహార పదార్థాలను సేవించే అలవాటుంటుంది. ఇలాంటివి తీసుకోవడం వలన వారి ఆరోగ్యం పాడైపోతుంది. వీటికి బదులుగా మామిడి పండు తీసుకోవడంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, పైగా జ్ఞాపకశక్తి మరింతగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.