శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pyr
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (13:07 IST)

మల్టీ టాస్క్ తో మెదడు దెబ్బతింటుందా..?

ఈ మధ్యకాలంలో పలురకాల వ్యాపారాలు, భిన్నమైన లక్ష్యాలను ఒకే సారి చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. వారిలో బహురకాల నైపుణ్యానికి వారిని మెచ్చుకోవాలా..? మీరు కూడా బహుళ నైపుణ్యాలను కలిగి ఉన్నారా..? ఏక కాలంలో వాటిని ప్రదర్శిస్తున్నారా..? అయితే కాస్త, జాగ్రత్త మీ చిన్న మెదడుకు చితికి పోగలదు. పెద్ద మెదడు జామ్ అయిపోగలదు.. ఇవేవో సినిమా డైలాగులు కాదండి. నిజం స్టాంఫోర్డు విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్న చేదు నిజాలు. 
 
రకరకాల పనులును ఏక కాలంలో చేసే గ్రూపులోని మనుషులను, ఒక సమయంలో ఒకే సమయంలో చేసేవారి శక్తి సామర్థ్యాలను పరిశీలించారు. రకరకాల గణణలు చేసిన తరువాత వారు ఓ నిర్ధారణకు వచ్చారు. అనేక ప్రోగ్రాంలను ఒకే మారు కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? జామయిపోతాయి. ఏ ప్రోగ్రాం కదలదు. ఇదే పరిస్థితి మనుషులలో కూడా కలుగుతుందని అంటున్నారు. శాస్త్రవేత్తలు.
 
ఒక లక్ష్యం నుంచి మరో లక్ష్యానికి మారే సమయంలో వారు పూర్తిగా మందగించిపోతున్నారు. పైగా ఒత్తిడి కారణంగా ఇతరులపై చిరాకు పడుతున్నారు. అదే ఒకే టాస్క్ ను కలిగి వారు మాత్రం చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఇటు మల్టీటాస్క్ కలిగిన వారు మాత్రం అక్కడ అవసరం లేని సమాచారాన్ని ఇక్కడ అవసరంలేని సమాచారాన్ని అక్కడ మార్చుకునే సమయంలో చాలా స్లో అయిపోతున్నారని గమనించారు. ఈ సమయంలో వచ్చే ఒత్తిడి కారణంగా మొదడు దెబ్బతినే అవకాశం ఉంటుందని వారు తేల్చేశారు. ఐక్యూ కూడా బాగా పడిపోతోందని గ్రహించారు.