శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (16:19 IST)

రాత్రివేళల్లో ఎన్నిసార్లు లైట్ వేస్తామో?

రాత్రిపూట చేసే ఉద్యోగాల పుణ్యమా అని సంతాన సాఫల్యత తగ్గుతుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. మెదడులోని పీనియల్ గ్రంథి ఉత్తేజితం అయినప్పుడు మెలటోనిన్ అనో హార్మోన్ విడుదలవుతుంది. 
 
గర్భం ధరించాలనుకున్నప్పుడు ఈ హార్మోనే కీలకం. చీకటిగా ఉన్నప్పుడు, రాత్రి నిద్రించినప్పుడూ ఈ హార్మోన్ విడుదలై మహిళల అండాన్ని భద్రపరుస్తుంది. దీనికి భిన్నంగా అర్థరాత్రి కూడా పట్టపగలు మాదిరిగా పనిచేస్తూ ఉండటం వల్ల సంతాన సాఫల్యత తగ్గుతుంది. అందుకే నిపుణులు గర్భం ధరించాలనుకొన్న మహిళలు రాత్రిపూట ఉద్యోగాలకు తాత్కాలికంగా దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. 
 
రాత్రివేళల్లో ఎన్ని సార్లు లైట్ వేస్తామో అన్ని సార్లూ సంతాన సాఫల్యత ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటిది పూర్తిగా రాత్రంతా మేలుకొని అధిక వెలుతురులో పనిచేయడం అనేది ఇంకెంత ప్రమాదమో గ్రహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.