శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (15:48 IST)

బ్రేక్ ఫాస్ట్‌లో అరటిపండు తీసుకుంటే?

ప్రతిరోజూ ఉదయం తీసుకొనే అల్పాహారంతో పాటు ఒక అరటి పండును తినడం చాలా మంచిది. డైట్‌లో ఐరన్ కంటెంట్ తప్పనిసరి ఫ్యాట్ బర్నింగ్ టిప్స్‌లో ఐరన్ కలిగినటువంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అలాగే అధిక బరువు తగ్గాలంటే.. గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృఢమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
 
అంతేకాదు గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉన్నదంటున్నారు. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి హృద్రోగాలను దూరం చేస్తుంది.
 
ఇకపోతే.. పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా.. వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువు తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క... కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. 
 
ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.