శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (13:26 IST)

ఆలివ్‌ నూనెను వాడితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదట!

మనం నిత్యం కొబ్బరినూనె, నువ్వుల నూనె, వేరుసెనగ నూనె, సఫోలా, సన్‌ఫ్లవర్ నూనెలాంటి వాటిలో ఏదో ఒకటి వాడుతుంటాం. అయితే పాశ్చాత్యులు వాడేది మాత్రం ఆలివ్ నూనె. ప్రస్తుతం మనదేశంలోనూ ఈ నూనె వాడకం క్రమంగా పెరుగుతోంది. ఆలివ్ నూనె శరీర బరువును నియంత్రిస్తుంది. 
 
ఆలివ్ నూనెని 2 లేదా 3సార్లు వాడినా ప్రమాదం ఉండదు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందంటున్నారు వైద్యులు. శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా ఉండేలా కాపాడుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 
 
ఈ నూనెలో విటమిన్ బీ, విటమిన్ ఇ, కెరొటిన్‌లు ఉండటం కారణంగా శరీరంలో కొవ్వు పెరగదు. దీంతో బీ.పీ, మధుమేహంలాంటి రోగాలు దరి చేరవంటున్నారు వైద్యులు. ఇక ఆరోగ్యంతో పాటు సౌందర్యానికి కూడా ఆలివ్ ఆయిల్‌కు పెద్ద పీటే వేయాలి. ఆలివ్ ఆయిల్‌ను గోరు వెచ్చగా వేడి చేసి జుట్టుకు పట్టిస్తే కుదుళ్ళు బలంగా తయారవుతాయి.
 
జుట్టుకు నూనె రోజూ నూనె వాడే వారు ఆలివ్ నూనెను వాడితే జుట్టు నునుపుగా తయారవుతుంది. స్నానం చేసే నీళ్ళలో రెండు చుక్కలు ఆలివ్ ఆయిల్ వేస్తే చర్మం మృదువుగా అవుతుంది. వంటికి మర్దన చేసుకుని స్నానం చేస్తే చర్మం తేమగా కాంతులీనుతుంది.