శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (16:42 IST)

కూరగాయల్లో ఉల్లిపాయ వయాగ్రా...

కూరగాయల్లో మునక్కాయే వయాగ్రా అని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. మునక్కాయ కంటే ఉల్లిపాయ మూడింతలు అధికమైన వయాగ్రా పనిచేస్తుంది. వెల్లుల్లి సెక్స్ సామర్థ్యాన్ని పెంచడం మాత్రమే గాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ వెల్లుల్లిని మాత్రం తీసుకునే వారు ఆయుష్మంతులని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉల్లి.. ఆపిల్ కంటే బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయను సూప్ రూపంలోనూ, వంటలు, సలాడ్స్‌లో చేర్చుకోవచచు. గుండెను కాపాడే ఉల్లిపాయ రక్తంలో కొలెస్ట్రాల్‌ను చేరనివ్వదు.  
a
శరీరంలోని మలినాలను వెలివేయడంలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. వంటల్లో ఉల్లిని చేర్చుకుంటే కిడ్నీ సంబంధిత రోగాలు దరిచేరవు. అలాగే ఎప్పుడూ అలసట ఉన్నట్లైతే వెల్లుల్లి, ఉల్లిపాయల్ని అధికంగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. ఉల్లిపాయను తీసుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. ఇంకా క్యాన్సర్ కణాలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.