శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 మే 2015 (19:02 IST)

టెన్షన్ పడుతున్నారా.. అయితే ఉల్లి ముక్కల్ని నమలండి

టెన్షన్ పడుతున్నారా.. అయితే పావు కప్పు ఉల్లి ముక్కల్ని నమలండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిపాయల్లో ఉండే క్వార్సిటిన్ నొప్పిని, ఒత్తిడిని, యాక్సైటిని నివారిస్తుంది.

కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే ఆహారంతో పాటు చిన్న చిన్న పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఉల్లిపాయ ముక్కల్ని అలాగే తినేయడం ఎంతో మేలు చేస్తుంది.  
 
అలాగే ఉల్లిపాయలో ఉండే విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ సి, వ్యాధినిరోధకతను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యాధులను , ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. 
 
ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే హృద్రోగ లోపాలతో ఇబ్బందులు తప్పవు. అందుచేత గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.