శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 27 ఆగస్టు 2014 (15:12 IST)

బొప్పాయి భోజనానికి ముందు తింటే ఏమవుతుంది...?

పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే కొన్ని రకాల పండ్లను భోజనానికి ముందు తినాలంటారు. బొప్పాయి పండుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా...? బొప్పాయి పండును భోజానికి ముందు తినాలా.. లేదంటే తర్వాత తినాలా అనే అనుమానం చాలామందిలో ఉంది. 
 
ఐతే ఏ పండునైనా భోజనం తర్వాత తిన్నట్లయితే అందులో ఉన్న చక్కెర నిల్వలు శరీరంలో అలాగే నిల్వ చేయబడతాయి. అందువల్ల బొప్పాయి పండును కూడా భోజనానికి ముందే తినాలి. భోజనం చేసే ముందు... కనీసం 3 గంటలకు ముందు బొప్పాయి పండును తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా భోజనానికి ముందు తినడం వల్ల పండ్లు శరీరానికి ఉపయోగపడుతాయి.