శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2015 (17:04 IST)

ప్రోటీన్లు ఆరోగ్యానికి అవసరమా? ప్రోటీన్స్ దాగివున్న ఆహార పదార్థాలేంటి?

ప్రోటీన్లు చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే వీటి అవసరం ఎంతైనా ఉంది. శరీరానికి పోషకాలు అందాలంటే.. అవి విటమిన్స్, ప్రోటీన్ల ద్వారానే. ప్రోటీన్లు వ్యాధులను నిరోధిస్తాయి. పిల్లల పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రోటీన్ శక్తి శరీరానికి చాలా అవసరం. ఈ ప్రోటీన్లు ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, మాంసం మొదలైన వాటిల్లో ఉంటాయి. 
 
సోయాలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వంద గ్రాముల సోయాలో 43 గ్రాముల ప్రోటీన్లు దాగివున్నాయి. మాంసంతో ధీటుగా సోయాలో ఈ ప్రోటీన్స్ లభిస్తాయి. పాలు, పెరుగు, మజ్జిగ, కోడిగుడ్డు, మీట్, చేపలు వంటి వాటిల్లో ప్రోటీనులున్నాయి. పిల్లల పెరుగుదల కోడిగుడ్డు, పాలు ఎంతగానో సహకరిస్తాయి. గోధుమలు, మొక్కజొన్న, సజ్జలు, రాగి, బియ్యం వంటి వాటిల్లోనూ ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఇంకా మినప్పప్పు, కందిపప్పు, బఠాణీలు, చిక్కుడు, బీన్స్ గింజల్లో ప్రోటీన్లున్నాయి. ఇవిగాకుండా జీడిపప్పు, వేరుశెనగ, ఆక్రూట్‌, బంగాళాదుంప, కేరట్, బీట్‌రూట్‌లలో ఉన్న ప్రోటీన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు.