శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2014 (18:45 IST)

రోజూ తలస్నానం చేస్తున్నారా? జాగ్రత్త సుమా!

రెగ్యులర్‌గా ప్రతి రోజూ తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిదేనా? రోజు తలస్నానం చేయడం వల్ల తల, స్లాప్(తల)లో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్‌కు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? అనేది తెలుసుకోవాలంటే.. చదవండి మరి. 
 
* రెగ్యులర్‌గా తలస్నానం చేస్తే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ కోల్పోతే, తిరిగి పొందడం కష్టం అవుతుంది. 
 
* ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయలేం. కాబట్టి రోజు మార్చి హెయిర్ బాత్ తీసుకోవచ్చు. 
 
* జుట్టు రంగు దీర్ఘకాలం అలాగే కొనసాగాలంటే, తలస్నానం చేయకపోవడం మంచిది. రోజూ తలస్నానం చేయకపోతే జుట్టు నేచురల్ కలర్ అలాగే ఉంటుంది. 
 
* ఏ రోజైతే తలస్నానం చేయకుండా ఉండరో.. షాంపును వాడకపోవడం వల్ల జుట్టు చిక్కుపడకుండా, పొడిబారకుండా అందంగా కనబడుతారు.
 
* ప్రతి రోజూ రెగ్యులర్‌గా తలస్నానం చేయడం వల్ల జుట్టుకున్న తడి ఆర్పడానికి హెయిర్ డ్రయ్యర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జుట్టు ఎక్కువగా రాలడానికి కారణం అవుతుంది. సో.. రెగ్యులర్ హెయిర్ బాత్‌ను తగ్గించడం మంచిది.