శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (14:38 IST)

శరీరం సక్రమంగా పనిచేయాలంటే.. ఆ ఆరు తప్పనిసరి!

శరీరం సక్రమంగా పనిచేయాలంటే.. ఆ ఆరు తప్పనిసరి! అవేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే పోషకపదార్థాలు తగినంతగా ఉండాలి. పోషకపదార్థాల్లో ఆరు రకాలు ఉన్నాయి. అవి నీరు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. 
 
సంతులిత ఆహారం తీసుకోవాలంటే అందుకు తగ్గట్టుగా ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపైనే కాకుండా మన భావోద్వేగాలపైన, శారీరక శక్తి స్థాయిపైన ప్రభావం చూపుతుంది. ఆరోగ్య భావన, ఏకాగ్రత, చురుకుదనం, సత్తువ వంటి లక్షణాలు మనలో చోటుచేసుకోవడంలో ఆహారం కీలకమవుతుంది. 
 
శరీర పోషణకు అవసరమయ్యే ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు సమృద్ధిగా పండ్లు, కూరగాయలు అన్ని ఇతర ఆహార ధాన్యాలలోనూ లభిస్తాయి. మాంసకృత్తులు పుష్కలంగా చేపలు, మాంసం, కోడి గుడ్లు, కాయలు, గింజలు, కాయధాన్యాలలోను, కొవ్వు పదార్థాలు అపారంగా పప్పు దినుసులు, తృణ ధాన్యాలు కొన్ని రకాల పండ్లు, కూరగాయలలో లభిస్తాయి. వీటిని సమపాళ్ళలో తీసుకుంటే ఆరోగ్యవంతులుగా జీవిస్తారని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.