శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (18:59 IST)

బర్గర్‌లో ఏముంది? హెల్దీ బర్గర్ తినాలంటే?

బర్గర్‌లో ఏముంది? హెల్దీ బర్గర్ తినాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలా.. అయితే చదవండి. అమెరికాలో ఎక్కువ శాతం అమ్ముడుబోయే ఆహార పదార్థాల్లో బర్గర్ ఒకటి. ఈ బర్గర్లకు మనదేశంలోనూ మాంచి డిమాండ్ పెరిగిపోయింది. 
 
జంక్ ఫుడ్‌గా పరిగణించే ఈ బర్గర్‌లో అధిక మోతాదు ఉప్పును ఉపయోగిస్తున్నారు. అంతేకాదు..కొవ్వు, చక్కెర, ఇంకా రసాయనాలు బోలెడున్నాయి. ఇందులో పోషకాలు, పీచు లేవు. వీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరదు. 
 
వీటిలో ఉపయోగించే చీజ్, చికెన్, వెజిటబుల్స్ కట్‌లెట్‌లు అధిక కార్బొహైడ్రేడ్లతో తయారైనవి. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం తెలిసినా పిన్నల నుంచి పెద్దల దాకా బర్గర్ అంటే ఇష్టపడని వారుండరు. 
 
బర్గర్‌ను తీసుకోవడం ద్వారా మెదడు సంబంధిత వ్యాధులు తప్పవు. బర్గర్‌లోని బన్ అధిక పంచదారతో తయారు కావడం ద్వారా మెదడులోని కణాలను దెబ్బతీస్తుంది. ఈ బన్ తీసుకోవడం ద్వారా సెరటోనిన్ అనే ద్రవ పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఇది డ్రగ్స్‌తో సమానమైందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 
సమతుల్య ఆహారంలో 500 కెలోరీలు ఉంటే కేవలం ఒకే ఒక్క బర్గర్‌‌లో 500 కెలోరీలు, 22 గ్రాముల ఫ్యాట్, 1,200 మి.గ్రాముల సోడియం ఉన్నాయి. బర్గర్‌తో తీసుకునే సాస్, చిరుతిళ్లు కూడా కెలోరీల సంఖ్యను పెంచేస్తున్నాయి. బర్గర్‌లో శరీరానికి కావలసిన పోషకాలు విటమిన్స్, ధాతువులు, పీచు పదార్థాలు చాలా తక్కువ శాతం ఉన్నాయి. 
 
బర్గర్‌లోని బన్ చెడిపోకుండా ఉండేందుకు ఉపయోగించే రసాయన పదార్థాలతో కూడిన గోధుమలను ఉపయోగిస్తున్నారు. తద్వారా ఊబకాయం ఏర్పడుతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా లేకపోవడం, రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గిపోవడం ద్వారా మధుమేహం వంటి వ్యాధులతో సమస్యలు తప్పవు. అంతేగాకుండా బర్గర్లు చాలాకాలం ఉండేందుకు వీలుగానూ, టేస్ట్ కోసమంటూ.. చికెన్, కూరగాయలకు ఫాట్ చేర్చడం ద్వారా ఒబిసిటీ, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, అల్జీమర్, మెదడు సంబంధిత వ్యాధులు ఏర్పడేందుకు అవకాశం ఉంది.  
 
ఇక హెల్దీ బర్గర్ తినాలంటే?
* వైట్ బన్‌కు బదులుగా ధాన్యాలు, నట్స్‌తో తయారు చేసే బన్‌లను ఉపయోగించవచ్చు.  
* కల్తీ లేని చీజ్‌ను ఉపయోగించి హోం మేడ్ బర్గర్‌ను తీసుకోవచ్చు.  
* మాంసం ముక్కల్లో కొద్దిపాటి నూనెను, ఫ్యాట్‌ను ఉపయోగించడం మంచిది.  
* లేకుంటే మాంసానికి బదులు పండ్లు, కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, కోడిగుడ్లతో బర్గర్‌ను తీసుకోండి.