శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (18:26 IST)

థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? జాగ్రత్త సుమా?!

థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. థైరాయిడ్ లక్షణాల్లో ప్రస్తుతం వినికిడి సమస్య కూడా చేరిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
 
థైరాయిడ్ లోపంతో బాధపడేవారిలో... ఆందోళన, చెమటలు పట్టడం, బరువు పెరగడం, జుట్టు ఊడటం, నిస్సత్తువలాంటి మరెన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఈ జాబితాలో ఇప్పుడు చెవుడు కూడా వచ్చి చేరింది. 
 
ఎదుగుతున్న దశలో థైరాయిడ్ హార్మోన్ల లోపం ఏర్పడితే వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని 'టెల్ అవీవ్' విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.