శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 28 మే 2015 (17:20 IST)

భోజనం చేశాక ఫుల్‌గా నీళ్ళు తాగేస్తున్నారా? కాస్త ఆగండి!

కొంతమందికి ఏం తిన్నా.. సులభంగా జీర్ణమైపోతుంది. అదే మరికొందరికైతే అబ్బో వద్దండీ... కడుపుకు సెట్ కాదు అంటుంటారు. అలాంటి వారు మీరైతే ఈ స్టోరీ చదవండి. ఏవి తిన్నా పడకపోతే.. కొన్ని టిప్స్ పాటించాలి. కడుపుకు మంచిచేసే ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే పడని ఆహారాన్ని పక్కనబెట్టేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే శక్తినిచ్చేవి ద్రవపదార్థాలే. అందులో ఆవుపాలు, మజ్జిగ, సూప్స్, నీరు, పండ్ల రసాలున్నాయి. 
 
వీటిని తీసుకోవడం ద్వారా తీసుకున్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. తద్వారా శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. అలాగే మంచి ఎండలో తిరిగొచ్చి.. చాలా కూల్‌గా వుండే డ్రింక్స్ లేదా చల్లని ఆహారాన్ని తీసుకుంటే ఉదర సమస్యలు తప్పకుండా ఏర్పడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే మజ్జిగ ఎక్కువ తాగకూడదు. తద్వారా శరీర వేడి ఉన్నట్టుండి పెరిగిపోతుంది. 
 
మజ్జిగను ఆహారం తీసుకున్న 15 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీరు సేవించడం మంచిది. అయితే ఆహారం తీసుకునేందుకు కూర్చునే ముందు అధికంగా నీరు తీసుకోవడం మంచిది కాదు. ఆహారం తీసుకునేటప్పుడు మధ్య మధ్యలో నీటిని కొంచెం కొంచెంగా సేవించాలి. అలాగే భోజనం చేశాక ఫుల్‌గా నీరు తీసుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలు తప్పవు. పెరుగన్నంలా కాకుండా మజ్జిగ అన్నం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
కాకరకాయ, వంకాయ, అవిసాకుల్ని.. ఇతర ఆహార పదార్థాలను కలిపి తీసుకోవాలి. వాటిని మాత్రం వట్టిగా తీసుకోకూడదు. ఇవి ఉదర సమస్యలను ఏర్పరుస్తాయి. అలాంటి  సమయంలో పెరుగన్నం తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.