శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pyr
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:40 IST)

అరటి ఆకులోనే ఎందుకు భోజనం చేయాలి?

ప్రకృతిలో ఎన్నో ఆకులు ఉన్నాయి. వాటన్నింటిలో కాకుండా మన వాళ్ళు కేవలం అరటి ఆకులో భోజనానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. పెళ్ళికెళ్ళినా అరిటాకే. పేరంటానికి వెళ్లినా అరిటాకే.. చివరకు పల్లెల్లో చుట్టానికి కూడా అరాటాకులోనే భోజనం వడ్డిస్తారెందుకు? మామూలు ఆకులో పెడితే భోజనం తినలేరా? ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. భారతీయ వైద్యం చాలా పురాతనమైనది. అంతేకాదు ప్రకృతిలోని ఏ చెట్టు మనకు మేలు చేస్తుందో.. ఏ చెట్టు కీడు చేస్తుందో కూడా ఇట్ట చెప్పేయగల చరిత్ర ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే ఉంది. అందుకే భోజనానికి అరటాకు శ్రేష్టమని చెప్పారు. అది ఎలాగో చూడండి.

 
ఆకలి మీద శత్రువైనా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపే సాంప్రదాయం మనది. అందుకే అతను ఎటువంటి సంకోచమూ లేకుండా ఆరగించడానికి అరటాకులో వడ్డిస్తారు. కారణం ఏంటంటే భోజనంలో విషం కలిపినా వెంటనే బయట పెట్టే గుణం అరటి ఆకుకు ఉంది. ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. 
 
ఇది అరటాకు మీదనున్న నమ్మకానికి సంబంధించిన విషయం మాత్రమే. కానీ అరటాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేడివేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.
 
ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినేఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం.  ఇది కేన్సరు మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్, హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. అంతేనా ఇది పర్యావరణ సమస్యను తీసుకురాదు. వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోతాయి.