గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (15:04 IST)

తలనొప్పి ఎలా వస్తుందో తెలుసా..?

కొందరికి ఆఫీసు పని వలన తలనొప్పి వస్తుంది. మరికొందరికి ఇంటి ఇబ్బందుల వలన కూడా తలనొప్పి వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఆలోచిస్తే కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన ఎక్కువగా ఉండాకూడదు. ఒకవేళ అలావున్నట్టైతే మధుమేహ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం..
 
ముందుగా ఒక బ్రౌన్ కాగితాన్ని కత్తిరించి ఆ పేపర్‌ను వెనిగర్‌లో కాసేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఈ కాగితాన్ని నుదుటిపై 10 నిమిషాల పాటు అలానే పెట్టుకోవాలి. తద్వారా తలనొప్పి మటుమాయం అవుతుంది. 
 
చేతులను 15 నిమిషాల పాటు అలానే ఊపడం వలన కూడా తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందంటే.. తల లోపలి భాగంలో రక్తనాళాలు నొక్కుకుపోవడం వలనే వస్తుంది. కనుక అప్పుడప్పుడు చేతులను కదిలిస్తూ ఉండాలి. అలాగని అదేపనిగా చేతులను ఊపడడం కూడా అంత మంచిది కాదు. మీరు ఊపే 5 లేదా 10 నిమిషాలలోనే తలనొప్పి తగ్గిపోతుంది.