గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (13:13 IST)

బ్రౌన్‌రైస్, చికెన్ వారానికి ఓసారి తీసుకుంటే..?

బ్రౌన్‌రైస్‌ను మష్రూమ్స్‌, వెజిటబుల్స్‌, చికెన్‌తో కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌, రెండు స్సూన్ల ఉప్పు, రెండు స్పూన్ల షుగర్‌, పావు కప్పు వెనిగర్‌, ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక కప్పు తులసి ఆకులు, ఒక కప్పు తరిగిన టొమాటో ముక్కలు, దోసకాయ, నల్లమిరియాల పొడి కొంచెం వేసుకుని సలాడ్‌గా చేసుకోవచ్చు. 
 
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశెకు బదులుగా అరకప్పు బ్రౌన్‌రైస్‌ను తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఒబిసిటీ మాయం అవుతుంది. బ్రౌన్‌రైస్‌ను రోజులో ఒక సారి తీసుకున్నా సరిపోతుంది. అయితే నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మెగ్నీషియం శాతంలో 21 శాతం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మైగ్రేన్‌ సమస్యను అరికడుతుంది.
 
స్థూలకాయంతో బాధపడేవారు బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని మేటి పోషకాలు అధిక రక్తపోటును, గుండె జబ్బులను దూరం చేస్తుంది. డయాబెటిస్‌ రోగులకు సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్‌రైస్‌తో చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.