శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (14:13 IST)

ఉదయాన్నే పరగడుపున ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

సాధారణంగా ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలామందికి ఉన్న అలవాటు. అంతేకాదు.. ఒక్కరోజు ఈ కాఫీ, టీ లేకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుందని చెప్తుంటారు. కానీ కాఫీ, టీలతో మైండ్‌ఫ్రెష్ అవుతుందని అనుకుంటున్న వారికి తెలియని నిజం ఏంటంటే.. పరగడపున తాగే టీ, కాఫీల వలన వారి హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన ఒత్తిడికి గురవుచేస్తాయి. కాఫీ, టీలే కాదు పరగడుపున ఇంకొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే కూడా శరీరానికి హాని కలుగుతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
1. టమోటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా ప్రేగుల్లో మంట పుట్టిస్తుంది.
 
2. పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయి అధికమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
 
3. స్పైసీ ఫుడ్స్ ఉదయాన్నే తీసుకుంటే అల్సర్ వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. 
 
4. ఉదయం లేవగానే.. సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల ప్రేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.