శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chitra
Last Updated : గురువారం, 21 జనవరి 2016 (12:06 IST)

డిప్రెషన్‌ తగ్గించేందుకు కొన్ని చిట్కాలు.. రోజువారీ పనుల్లో ఆందోళనలు అస్సలొద్దు!

నేటితరం యువతకు అన్ని అందుబాటులో ఉంది. అధునాతన సౌకర్యాలు, అనువైన పరిస్థితులు అన్ని వారికి అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడున్న కుటుంబాల్లో చాలావరకు ఒక సంతానం ఉండటం వల్ల వారికి తల్లిదండ్రులు పూర్తి స్వేచ్చనిస్తున్నారు. కాబట్టి యూత్ ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. ఇంతటి సౌకర్యవంతమైన కుటుంబాల్లో పెరిగిన యువత.. జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒడిదుడుకుల్ని తట్టుకోలేక పోతున్నారు. కష్టాలు వస్తున్నప్పుడు కుంగిపోయి విషాదంలోకి జారిపోతున్నారు. ఈ పరిస్థితినే డిప్రెషన్ అంటారు.
 
డిప్రెషన్ తలెత్తకుండా తీసుకొనే జాగ్రత్తలు టో చూద్దాం. కొత్త విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి. హాబీలతో మానసికంగా సేద తీరవచ్చు. అందుకే చాలా పెద్ద స్థాయిలో స్థిరపడిన వారు కూడా హాబీలను వదులకోరు. చాలావరకు పుస్తకపఠనం మంచిది. ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు పుస్తకాలు చదవటంతో తమ దృష్టిని మళ్లించుకోగలుగుతారు. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. కావాలంటే కొంత సేపు గ్యాప్‌ తీసుకొని నిదానంగా ఆలోచించి వ్యవహరించాలి. లేదంటే తప్పు మీద తప్పు జరిగి మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. 
 
రోజువారీ పనుల్లో ఆందోళనలు పెట్టుకోకూడదు. ఒకటే ఆలోచన వెంటపడి తరుముతుంటే దాని మీద నుంచి డైవర్షన్ తీసుకోవాలి. పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. పదేపదే దాని గురించే ఆలోచించడం మంచిది కాదు. కొన్ని విషయాలు మన చేతిలో ఉంటాయి. మరి కొన్ని విషయాలు మన చేతిలో లేదన్న జీవన సత్యాన్ని గ్రహించాలి. శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ఒకేచోట కదలకుండా కూర్చొని పని చేస్తే మెదడు మొద్దుబారిపోతుంది. అందుకని తేలికపాటి వ్యాయామాల ద్వారా రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. అప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.