గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (18:47 IST)

అమ్మో.. రాత్రి పూట పెరుగు తింటున్నారా...?

పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మ

పెరుగు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. పెరుగు రెగ్యులర్‌గా తింటే జీర్ణ వ్యవస్థ రెగ్యులర్ గా పనిచేస్తుంది. పెరుగులోని బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది పెరుగు అన్నాన్ని మూడుపూటలా తినేస్తుంటారు. అయితే రాత్రి పూట పెరుగన్నం తినొచ్చా..లేదా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. 
 
సాధారణంగా రాత్రిపూట పిల్లలు పెరుగు అన్నం అడిగితే పెట్టరు. ఎందుకంటే జలుబు చేస్తుందని పెట్టరు. వాస్తవానికి పెరుగన్నం తినొచ్చా.. లేదా అన్నది తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుతూ ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును ఎక్కువగా తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో తలనొప్పి, జలుబుతో బాధపడేవారికి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. జలుబు, దగ్గు లేని వారు రాత్రి పూట ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగన్నం తినేయవచ్చు.