ఇంటిని శుభ్రంగా వుంచుకోవట్లేదా? అయితే ప్లాస్టిక్ భోజనం తింటున్నట్లే.. ఎలా?

శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (16:06 IST)

food

ఇంటిని శుభ్రంగా వుంచుకుంటున్నారా? ఇల్లు శుభ్రంగా లేకపోతే.. కలుషితమైన ఆహారం తీసుకున్నట్లేనని తాజా అధ్యయనంలో తేలింది. ఎలాగంటే..  ఇంట్లో మనం వుపయోగించే ఫర్నిచర్లపై కప్పే సోఫా కవర్లు, కర్టెన్లు, సింథటిక్ వస్త్రాల రేణువులు ఇంట్లోని దుమ్ములోకి చేరి చివరికి అవి భోజన ప్లేట్లలోకి వస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. 
 
దుమ్ము ధూళిలో ప్లాస్టిక్ సులభంగా కలిసిపోతుందని.. ఆ రేణువులు ఆరోగ్యానికి పెద్ద మహమ్మారిగా తయారవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. తక్కువ బరువున్న ప్లాస్టిక్ వస్తువుల్లోని రేణువులు దుమ్ములో చేరి.. చివరికి అందులోని రసాయనాలు ఆహారంలో చేరి ఆరోగ్యాన్ని కబళిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. 
 
ఇంకా సోఫాలపై ఉపయోగించే కవర్లు, సింథటిక్ వస్త్రాల రేణువులు ఇంట్లోని దుమ్ములోకి చేరి చివరికి మనం ఆహారం తీసుకునే ప్లేటుల్లోకి వస్తున్నాయని బ్రిటన్‌లోని హెరియాట్ వాట్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. ప్లాస్టిక్‌తో కూడిన దుమ్ము టేబుల్స్‌ను అంటి పెట్టుకుని అక్కడి నుంచి భోజన ప్లేటుల్లోకి చేరుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇలాచేరిన ప్లాస్టిక్ రేణువులు మన కంటికి కనిపించకపోవడంతో అవి ఆహారంతో కలిసి మన శరీరంలో చేరిపోతున్నాయని ఇలా ఓ వ్యక్తి సగటున ఏడాదికి 68,415 ప్లాస్టిక్ ఫైబర్లను తింటున్నట్లు తెలిపారు. రోజుకు వంద ప్లాస్టిక్ రేణువులు మనం తీసుకునే ఆహారంలో కలిసిపోతున్నాయని.. అలా కలుషిత ఆహారాన్ని తీసుకుంటున్నామని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
కాబట్టి వారానికి ఓసారైనా ఇంటిని శుభ్రం చేయాలని.. సోఫా కవర్లు ప్లాస్టిక్ కాకుండా చూసుకోవాలి. అలాగే సింథటిక్ వస్త్రాలను ఉపయోగిస్తున్నప్పుడు వాటిని డైనింగ్ రూమ్‌కు వంటగదికి దూరంగా వుంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేసవిలో పెరుగు తప్పనిసరి.. చెమటకు చెక్ పెట్టాలంటే... గుమ్మడి గింజల్ని?

వేసవిలో పెరుగు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగును బాగా చిలక్కొట్టి చక్కెర, ఉప్పు, ...

news

ముల్లంగి రసాన్ని రోజుకో గ్లాసుడు తీసుకుంటే.. సలాడ్‌లో కలుపుకుంటే?

వేసవిలో ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణశక్తిని ...

news

ఉల్లిపాయ రసంలో దాన్ని కలుపుకుని చప్పరిస్తే...

సాధారణంగా ఉల్లిపాయమనను కూరల్లో మాత్రమే వాడుకుంటామని మనందరికి తెలుసు. కానీ మనకు తెలియని ...

news

వాళ్లు మాట్లాతుంటే నోరు వాసన వస్తోందా...? ఈ చిట్కాలు షేర్ చేయండి...

కొంతమంది మాట్లాడుతున్న, నవ్వుతున్నా నోరు వాసన వస్తుంది. నోరు దుర్వాసన రావడానికి పళ్లు ...