బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 22 మే 2019 (18:38 IST)

బరువును తగ్గించే కలబంద..

కలబంద చాలా రకాలుగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు, దీనిని అనేక సౌందర్య ఉత్పత్తులలో, షాంపూలలో ఉపయోగిస్తుంటారు, కలబందను తినడం వలన కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా స్థూలకాయంతో బాధపడేవారు వ్యాయామం చేయడంతోపాటు దీనిని తీసుకుంటే మంచిది. వీరు ప్రతిరోజూ కలబంద రసాన్ని త్రాగాలి. 
 
కలబంద శరీర అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఈ కలబంద రసం జీర్ణక్రియలు పెంచుటకు చక్కగా సహాయపడుతుంది. అల్లం వేసి మరిగించిన నీటిలో కలబంద రసం వేసి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాలను కూడా పాటించవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 
 
అధిక బరువును తగ్గించడంలో గ్రీన్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో కలబంద రసం వేసుకుని వేడిచేసి ఉదయం పూట, రాత్రి పూట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
స్ట్రాబెర్రీ పండ్లు కూడా అధిక బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు స్ట్రాబెర్రీ పండ్లు తింటే మంచిది.