మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 23 మే 2018 (11:15 IST)

వారానికి ఐదు కోడిగుడ్లు తీసుకుంటే..?

కోడిగుడ్లను వారానికి ఐదు సార్లు తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని.. పెకింగ్ యూనివర్శిటీ హెల్త్ సైన్స్ సెంటర్, ఆక్

కోడిగుడ్లను వారానికి ఐదు సార్లు తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని.. పెకింగ్ యూనివర్శిటీ హెల్త్ సైన్స్ సెంటర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఆరోగ్యవంతులైన నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశోధకులు పరిశీలించారు. 
 
ఈ పరిశోధనలో రోజూ కోడిగుడ్డు తినేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే గుడ్డు తినని వారి కంటే తినేవారిలో గుండెపోటు ముప్పు కూడా 26 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేగాకుండా గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 18 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. 
 
అందుకే ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు ఓ కోడిగుడ్డు తీసుకోవాలని పరిశోధకులు తెలిపారు. కోడిగుడ్డు తెల్లసొనతో పలు రోగాలు నయం అవుతాయి. దాదాపు తొమ్మిదేళ్ల పాటు పరిశోధకులు ఈ స్టడీని నిర్వహించారని... కోడిగుడ్లు తీసుకునే వారిలో హృద్రోగాలు తగ్గాయని, హైబీపీ, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు దూరమయ్యాయని తేలిందన్నారు.