రోజూ అర కప్పు.. ఆపిల్ ముక్కలు తింటే?
రోజూ ఓ యాపిల్ తింటే.. హృద్రోగాలను నివారించవచ్చు. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉన్న యాపిల్ మనకు పలురకాల క్యాన్సర్‌ల నుంచి రక్షణ ఇస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ ఒక యాపిల్ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ రానే రాదు. మోనోపాజ్ దశలో మహిళలో సంభవించే ఎముకలకు సంబంధించిన ఇబ్బందుల్ని తొలగిస్తుంది.
టైప్-2 డయాబెటిక్‌తో బాధపడే వారు ఉదయం, రాత్రి.. అరకప్పు యాపిల్ తింటే మంచి ఫలితాలుంటాయి. ఆస్తమాతో బాధపడేవారు విడవకుండా రోజూ ఓ యాపిల్ తింటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. రెగ్యులర్‌గా యాపిల్ జ్యూస్ తాగినా.. పండు తిన్నా కిడ్నీలలో రాళ్ళు తయారు కావని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.