సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (19:26 IST)

అధిక బరువును అడ్డుకునే ఆప్రికాట్స్

ఆప్రికాట్ల‌లో ఉండే ఔష‌ధ గుణాలు అధిక బ‌రువును త‌గ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే ఫైబ‌ర్ ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చూస్తుంది. దీంతో ఆహారం త‌క్కువ తీసుకుంటారు. ఫ‌లితంగా బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.
 
ఆప్రికాట్ల‌లో ఉండే విట‌మిన్ సి, ఇ లు చ‌ర్మానికి సంర‌క్ష‌ణ‌ను ఇస్తాయి. ముఖ్యంగా చ‌లికాలంలో ఏర్ప‌డే చ‌ర్మం ప‌గుళ్లను నివారిస్తాయి. దీంతో చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.
 
కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆప్రికాట్ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది. దృష్టి పెరుగుతుంది. చలికాలంలో స‌హ‌జంగానే ఏర్ప‌డే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాలంటే.. ఆప్రికాట్ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అజీర్ణం అనే మాటే ఉండ‌దు. 
 
అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారికి ఆప్రికాట్స్ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిలో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను పోగొడుతుంది. ర‌క్తాన్ని ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. అందువ‌ల్ల రక్తం లేద‌నే స‌మ‌స్య ఉండ‌దని వైద్యులు సూచిస్తున్నారు.