బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (19:04 IST)

చేతికి ఎప్పుడూ స్మార్ట్ వాచ్ కట్టే వారు తెలుసుకోవాల్సినవి

watch
చేతికి ఎప్పుడూ స్మార్ట్ వాచ్ కట్టే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు వున్నాయి. స్మార్ట్‌వాచ్‌లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌వాచ్‌లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా చర్మ సమస్యలు ఏర్పడే అవకాశం వుందని వారు చెప్తున్నారు. 
 
నరాల వ్యవస్థను స్మార్ట్ వాచ్ దెబ్బతీసే అవకాశం వుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే స్మార్ట్ వాచ్‌లను అదే పనిగా చేతులకు కట్టుకుని వుండటం చేస్తే ఇలాంటి అనారోగ్య సమస్యలు తప్పవని గుర్తుంచుకోవాలి. 
 
అలాగే స్మార్ట్ వాచ్ వాడకం ద్వారా తలనొప్పి, మెమరీ లాస్, మానసిక ఒత్తిడి, ఒంటరితనం, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
 
అలాగే వ్యాయామాల సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాంటి సమయంలో స్మార్ట్ వాచ్ వాడకం ద్వారా అందులోని రేడియేషన్ శరీరానికి మేలు చేయదని వైద్యులు చెప్తున్నారు. స్మార్ట్ వాచ్ వాడకాన్ని తగ్గించాలని వారు హెచ్చరిస్తున్నారు.