శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (10:03 IST)

వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయల్ని వేపుకుని తింటే..?

వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉల్లిపాయలను దోరగా బాణలిలో వేపి తీసుకోవాలి. ఉల్లిలో వుండే స్కాలియన్లు అధికంగా సల్ఫర్ సమ్మేళనాలు శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్త

వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉల్లిపాయలను దోరగా బాణలిలో వేపి తీసుకోవాలి. ఉల్లిలో వుండే స్కాలియన్లు అధికంగా సల్ఫర్ సమ్మేళనాలు శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే విటమిన్ బి గల పచ్చని ఆకుకూరలు, పప్పులను తీసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్‌ను ఉపయోగించాలి. 
 
ఇంకా బీటా-కెరోటినాయిడ్‌లు ఎక్కువగా వుండే పండ్లు ఆప్రికాట్, క్యారెట్స్ తీసుకోవాలి. పాలకూర వంటివి తీసుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వుండే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. 
 
ఆరెంజ్, బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోకూడదు. అయితే కారం, అల్లం కలిపిన ఆహారాలకు, మిరియాలు కలిపిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఎక్కువ కొవ్వు ఉన్న పాలపదార్థాలను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.