శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (14:17 IST)

దాంపత్యానికి మేలు చేసే బొప్పాయి... జలుబు తగ్గాలంటే?

బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిని రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా దాంపత్య జీవితం మెరుగ్గా వుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీర్యంలో నాణ్యతను పెంచడంతో పాటు బొప్పాయిలోని ఎంజైమ్ అని

బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిని రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా దాంపత్య జీవితం మెరుగ్గా వుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీర్యంలో నాణ్యతను పెంచడంతో పాటు బొప్పాయిలోని ఎంజైమ్ అని పిలువబడే అర్జినిని.. మర్మాంగాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా కండరాల పనితీరు మెరుగవుతుంది. అలాగే బొప్పాయిలో యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుండటం ద్వారా.. నిత్యయవ్వనులుగా కనిపిస్తారు. ఇందులోని విటమిన్ సి, విటమిన్-ఇ వంటివి ముఖంపై వుండే ముడతలను దూరం చేస్తుంది. 
 
చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. శిరోజాలకు మేలు చేస్తుంది. చుండ్రును దూరం చేస్తుంది. బొప్పాయితో ఎయిర్ మాస్క్ వుపయోగించడం ద్వారా జుట్టు బలంగా వుంటాయి. వంద గ్రాముల బొప్పాయి గుజ్జు, వంద గ్రాముల అరటి గుజ్జు, 100 గ్రాముల పెరుగు, ఒక స్పూన్ కొబ్బరినూనెను చేర్చి.. పేస్టులా తయారు చేసుకుని.. జుట్టుకు, మాడుకు రాయడం ద్వారా చుండ్రు తొలగిపోతుంది. జుట్టు మృదువుగా తయారవుతుంది.
 
ఇక బొప్పాయిని తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇందులోని పోషకాలు బరువును తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. అలాగే మతిమరుపుకు కూడా బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను బొప్పాయి దూరం చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి వ్యాధినోరధక శక్తి పెంచేలా చేస్తుంది. తద్వారా తరచూ వేధించే జబ్బు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.