వర్షాకాలం.. నల్ల మిరియాలను మర్చిపోకండి..
వర్షాకాలం ఆహారంలో నల్ల మిరియాలు తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి స్థూలకాయాన్ని తగ్గించడం నుంచి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం వరకు అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతాయి. నల్ల మిరియాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. దీనివల్ల మీరు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో నల్ల మిరియాలు చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడుతారు. అంతేకాదు వీటిని టీలో కలుపుకొని తాగవచ్చు.
నల్ల మిరియాలు జలుబు, దగ్గులో ఉపయోగకరంగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే అనేక మూలకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పెప్పరైన్ అనే రసాయనం ఉంటుంది.
ఇది జలుబు, దగ్గు, వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పుల సమస్యలని తగ్గించడంలో నల్ల మిరియాలు ప్రయోజనకరంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ బ్లాక్ పెప్పర్‌లో ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.