1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (17:36 IST)

బ్లాక్ టీ సేవిస్తే.. కలిగే ప్రయోజనాలు..?

టీ అనే పదార్థం పూర్వకాలం నుండే ఉంది. దీనిని అన్నీ ప్రదేశాల్లో వాడుతారు. టీ యొక్క రుచి చాలా బాగుంటుంది. టీ తీసుకుంటే అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. రోజుకో కప్పు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోనలెన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
 
టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలోని అవయవాలను మరమ్మత్తు చేస్తాయి. ఈ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. క్యాన్సర్ వ్యాధిని అడ్డుకునేందుకు ఎంతో సహాయపడుతాయి. చాలామందికి మతిమరువు ఎక్కువ. అలాంటి వారు కప్పు టీ తీసుకుంటే.. వారు ఎలాంటి క్లిష్ట విషయాలనైనా మరచిపోకుండా గుర్తుంచుకుంటారు.
 
బ్లాక్ టీ తాగితే శరీరం ఎప్పుడూ అలసటకు లోనవకుండా ఉంటుంది. ఈ బ్లాక్ టీలో 20 శాతం శరీరానికి కావలసిన ఎనర్జీ ఉంటుంది. అందువలన ఒత్తిడి, నీరసంగా ఉన్నప్పుడు బ్లాక్ టీ తాగండి.. ఈ సమస్యకు చెక్ పెట్టండి. ప్రతి ఒక్కరి శరీరంలో ఒత్తిడి అనే హార్మోన్ తప్పకుండా ఉంటుంది. ఆ హార్మోనే శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఆ హార్మోన్‌కు పరిష్కార మార్గం బ్లాక్ టీనే. కనుక తప్పక బ్లాక్ టీ సేవించండి.
 
బ్లాక్ టీ తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు దానికంటే రెట్టింపవుతుంది. ఈ బ్లాక్ టీ తాగితే రిలాక్స్‌గా అనిపిస్తుంది. గుండె వ్యాధులతో బాధపడేవారు తప్పక టీ తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. టీలోని ఖనిజ లవణాలు గుండెపోటును, గుండెలో ఏర్పడే రక్త గడ్డలను తొలగిస్తాయి. బ్లాక్ టీ తీసుకుంటే... 70 శాతం గుండె జబ్బుల నుండి విముక్తి లభిస్తుందని వెల్లడించారు వైద్యులు.