మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (10:55 IST)

కల్యాణ్ రామ్‌తో షాలినీ పాండే.. నివేదా థామస్.. 118 ట్రైలర్ (వీడియో)

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారాడు. కేవీ గుహన్ త్వరలో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. యంగ్ టైగర్ సోదరుడు, నందమూరి హీరో కల్యాణ్ రామ్‌తో అతడు సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పదేళ్ల క్రితం తెలుగులో హిట్ అయిన హ్యాపీడేస్ సినిమాలో తమిళంలో ఇనిదు ఇనిదుగా రీమేక్ చేశాడు. ఆ సినిమా అతనికి ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది.
 
ప్రస్తుతం మళ్లీ దర్శకుడిగా మారనున్న గుహన్.. కల్యాణ్ రామ్‌తో కొత్త సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తారని తెలుస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించే ఈ సినిమాకు 118 అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమా టీజర్ కూడా రిలీజైంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
 
దర్శకుడు - గుహన్ 
నిర్మాత - మహష్ ఎస్ కోనేరు 
ఎడిటిగ్- తమ్మిరాజు 
సంగీతం.. శేఖర్ చంద్ర 
డైలాగులు - మిర్చి కిరణ్, వి. శ్రీనివాస్