శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (10:38 IST)

శరీరం వేడైందా..? అయితే జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు..!

జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫ్ఫిన్ ఇలాంటి వాటి వల్ల శరీరం వేడికి గురి అవుతుంది. అంతేకాక జబ్బులు, మందులు కూడా శరీరంలో వేడి పెరగటానికి కారణాలవుతాయి. అయితే ఈ శరీరంలోని వేడిని తగ్గించాలంటే ఈ చిట్కాలు పాటిస్త

జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫ్ఫిన్ ఇలాంటి వాటి వల్ల శరీరం వేడికి గురి అవుతుంది. అంతేకాక జబ్బులు, మందులు కూడా శరీరంలో వేడి పెరగటానికి కారణాలవుతాయి. అయితే ఈ శరీరంలోని వేడిని తగ్గించాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.. బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే అవి శరీరానికి వేడిని కలిగిస్తాయి. థైరాయిడ్ సమస్య వల్ల శరీరంలోని వేడి పెరిగిపోతుంది. అధిక వ్యాయామం కూడా వేడి చేసేందుకు కారణమవుతుంది. 
 
న్యూరో సంబధిత అసమానతలు కూడా శరీర వేడికి కారణమవుతాయి. అంతేకాక ఇతర కారణాలుగా సోరియాసిస్, సెలొరోసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎక్జెమా ఈ జబ్బులు అధిక వేడి పెంచి అధిక చెమట పట్టేలా చేస్తాయి. 
 
శరీరంలోని వేడిని ఎలా తగ్గించుకోవాలంటే..?
* వేడి ప్రాంతాలకు దూరంగా ఉండాలి, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.
* కొవ్వు పదార్ధాలను అలాగే వేపుని పదార్ధాలకు దూరంగా ఉండాలి.
* కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లను వాడండి. వంటలలొ కూడా వేరుశనగ నూనె వంటివి మానేయాలి
* శాకాహారాన్ని తీసుకోవడం ఉత్తమం. రెడ్ మీట్‌ను తీసుకోవడం తగ్గించాలి. 
* రోజూ ఉదయాన్నే దానిమా జ్యూస్ ఒక గ్లాస్ తాగండి. 
* నీరు తగిన మోతాదులో తీసుకోవాలి. 
* మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవాలి
* తేనె, పాలు కలిపి తాగితే మంచిది.