1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (14:24 IST)

జుట్టు రాలిపోవటానికి గల కారణాలు

జుట్టు రాలిపోవటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. ఒత్తిడి, పోషకాల లోపం వంటివెన్నో దీనికి కారణం కావొచ్చు.
 
జుట్టు పెరగటానికి ఐరన్ ఎంతో మేలు చేస్తుంది. ఇది లోపిస్తే జుట్టు రాలిపోవచ్చు. ఇక ప్రోటీన్ లోపించినపుడు మొదట్లో జుట్టు పెరగటం ఆగిపోతుంది. ఆ తర్వాత క్రమంగా ఊడిపోవటం మొదలవుతుంది. కాబట్టి పాలకూర, పప్పులు, మాంసం, గుడ్లు, చేపలు, బాదం వంటి గింజపప్పులు, చిక్కుళ్లు తీసుకోవటం మంచిది.
 
కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి మూలంగా మన రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పొచ్చు. ఇది పొరపాటు వెంట్రుకల కుదుళ్ల మీదే దాడిచేయొచ్చు. ఫలితంగా జుట్టు ఊడిపోవచ్చు. తీవ్రమైన బాధ, ఆందోళన మూలంగానూ జుట్టు పెరగటం నెమ్మదిస్తుంది. దీంతో దువ్వినపుడు తేలికగా వెంట్రుకలు ఊడివచ్చే ప్రమాదముంది.
 
సిగరెట్ పొగలోని విషతుల్యాలు వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తాయి. జుట్టు పెరిగే ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. కాబట్టి పొగ అలవాటుకు దూరంగా ఉండటం ఉత్తమం.