శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 8 మే 2021 (23:06 IST)

Corona ఏ స్థాయిలో వుందో తెలుసుకునేందుకు ఆక్సీమీటర్‌తో చెకప్, తెలుసుకోవడం ఎలా?

SpO2.. అంటే బ్లడ్ ఆక్సిజన్ సంతృప్తత. రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని ఇది తెలియజేస్తుంది. 95% లేదా అంతకంటే ఎక్కువ ఉన్న SpO2 సాధారణ ఆక్సిజన్ స్థాయిగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, 92% లేదా అంతకంటే తక్కువ SpO2 రక్తం సరిగా సంతృప్తమైందని సూచిస్తుంది. తగినంత సంతృప్తత లేకపోతే ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది, హృదయ స్పందన రేటుతో సహా ప్రతికూల ఆరోగ్య పరిస్థితులకు కారణమవుతుంది.
 
పల్స్ రేట్ అంటే ఏంటి?
పల్స్ రేటు గుండె నిమిషానికి ఎన్నిసార్లు సంకోచిస్తుందో తెలుసుకునే అంచనా. పెద్దలకు సాధారణ పల్స్ రేటు విలువలు నిమిషానికి 60 నుండి 100 బీట్స్ వరకు ఉంటాయి. సాధారణంగా, విశ్రాంతి సమయంలో తక్కువ హృదయ స్పందన రేటు నమోదవుతుంటుంది. కొంతమందికి, 60 బిపిఎమ్ కంటే తక్కువ పల్స్ రేటు అసాధారణంగా నెమ్మదిగా గుండె కొట్టుకోవడాన్ని సూచిస్తుంది, దీనిని బ్రాడీకార్డియా అని కూడా పిలుస్తారు. బ్రాడీకార్డియా అనేది మూర్ఛ, అలసట, ఛాతీ నొప్పులు, జ్ఞాపకశక్తి సమస్యలతో సహా అనేక సమస్యాత్మక లక్షణాలను కలిగిస్తుంది.
 
సహజంగా మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లో ఫిల్ట‌ర్ అవుతుంది. ఆ త‌ర్వాత ఎర్ర ర‌క్త క‌ణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శ‌రీరం మొత్తం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతుంది. హిమోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజ‌న్ స్థాయిని ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు లెక్కిస్తాయి. అందుకే ఈ కరోనా టైంలో వాటి గిరాకీ బాగా పెరిగిపోయింది.
 
ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ చిన్న క్లిప్ మాదిరి ఉంటుంది. ఈ క్లిప్పును చేతి వేలికి గోరు భాగంలో పెట్టుకోగానే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను రీడింగ్ రూపంలో కనబడుతాయి. ఆరోగ్యంగా ఉన్న వారిలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 95 నుంచి 99 శాతం వ‌ర‌కు ఉంటాయి. అదే ఆక్సిజ‌న్ 92 శాతం వ‌ర‌కు స్థిరంగా ఉంటే ఫ‌ర్వాలేదు. కానీ అంత‌కంటే త‌గ్గితే మాత్రం వైద్యుడిని సంప్ర‌దించాల్సి వుంటుంది. కరోనా వైరస్ వ్యాధి సమయంలో ఈ ఆక్సీమీటర్ల ప్రాధాన్యత బాగా పెరిగింది.
 
ఆక్సీమీటర్‌తో పల్స్ చూసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి గోళ్ల‌కు నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని తొలగించాలి. అలాగే చేతులు చ‌ల్ల‌గా ఉంటే వెచ్చ‌ద‌నం కోసం ఒకట్రెండు నిమిషాలు చేతులు రుద్దుకోవాలి. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ వాడే ముందు క‌నీసం 5 నిమిషాలు ఏ ఆలోచ‌న చేయకుండా విశ్రాంతిగా వుండాలి. ఆ తర్వాత కొద్దిసేపు చేతిన ఛాతీపై వుంచుకోవాలి.
 
అటు తర్వాత ఆక్సీమీట‌ర్‌ను క‌నీసం నిమిషం సేపు చేతి వేలికి పెట్టుకోవాలి. రీడింగ్ స్థిరంగా చూపించేవ‌ర‌కు అలాగే ఉంచాలి. ఈ రీడింగ్ 5 సెక‌న్ల పాటు ఎలాంటి మార్పు లేక‌పోతే దాన్ని అత్య‌ధిక రికార్డుగా భావించాలి. ఇలా ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను ప్ర‌తిరోజు ఒకే స‌మ‌యంలో మూడుసార్లు రికార్డు చేయాలి. ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా అనిపించినట్లనిపించినా లేదంటే ఆక్సీమీటర్లో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 92 శాతం త‌క్కువ‌గా ఉన్నా వెంటనే వైద్య సహాయాన్ని పొందాలి.