శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (13:01 IST)

గోరు చిక్కుడుతో కొవ్వు మటాష్..

Cluster Beans
గోరు చిక్కుడులో పోషకాలు పుష్కలంగా వున్నాయి. ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌-ఎ, సి, కెలు వున్నాయి. కొవ్వును కరిగించడానికి సహాయ పడుతుంది. ఇందులో పీచు అధికంగా వుండటంతో ఒబిసిటీ దూరం అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్‌ సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహ పీడితుల్లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఎముకలకు బలం. 
 
గోరు చిక్కుడు గింజలను ఎండబెట్టి పొడిచేసి కూరల్లో వేసుకోవచ్ఛు వీటి ఆకులను పప్పులో కలిపి వండుకోవచ్చు. గర్భిణులు గోరుచిక్కుడును ఆహారంలో భాగం చేసుకుంటే గర్భస్థ శిశువు పెరుగుదలకు తోడ్పడుతుంది. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. రక్తహీనత నుంచి వదిలించుకోవటం కోసం గోరు చిక్కుడు కాయలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.