Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేసవిలో కీరదోసకాయను రోజూ తినండి.. లేకుంటే?

శనివారం, 10 మార్చి 2018 (19:03 IST)

Widgets Magazine

వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మార్చిలోనే మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. పానీయాలను అధికంగా తీసుకోవాలి. జ్యూస్‌లు, పండ్లు, కొబ్బరి నీరును సేవిస్తుండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోసను తప్పక తీసుకోవాలి. లేకుండే శరీరం డీ-హైడ్రేషన్‌కు లోనవుతుంది. కీరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. 
 
కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరం తేమను కోల్పోదు. పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ రెండు గ్లాసుల కీరదోస జ్యూస్ తాగితే అల్సర్ దూరమవుతుంది. వేసవిలో పండ్లతో చేసిన సలాడ్స్‌లో కీర ముక్కలు తీసుకోవడం మంచిది. కీరదోసలో పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. 
 
చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. కీరతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలు తక్కువ ఉండడం చేత బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. దృష్టి సంబంధ సమస్యలను కీరదోసకాయ దూరం చేస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను కీరదోస దూరం చేస్తుంది. మధుమేహం, కొలెస్ట్రాల్‌లను తగ్గించేందుకు కీరదోస ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బీపీ కూడా అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కొత్తగా పెళ్లయిన జంటల్లో శృంగారం పట్ల భయం... కానీ...

కొత్తగా పెళ్లయిన జంట శృంగారం విషయంలో ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా మగవారు తమ భార్యను ...

news

బరువు తగ్గాలా? కొబ్బరినూనెను వంటల్లో వాడండి.. మరి డిమాండ్?

కొబ్బరి నూనెను వంటల్లో వాడటం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు ...

news

వేసవిలో ధనియాలు తీసుకుంటే కలిగే మేలు ఏమిటి?

ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం. 1. నిద్రలేమితో బాధపడే వారు ...

news

వాయు కాలుష్యంతో హృద్రోగాలు...

చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న ...

Widgets Magazine