శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (17:09 IST)

మష్రూమ్స్ తింటే.. గుండెకు మేలు.. ఎలా?

మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ-యాక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి. మష్రూమ్స్‌లోని అమినో యాసిడ్స్, యాంటీ-యాక్సిడెంట్లు వ్యాధులను దరిచేరనివ్వవు. ఇవి చెడు కొలెస్ట్

మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ-యాక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి. మష్రూమ్స్‌లోని అమినో యాసిడ్స్, యాంటీ-యాక్సిడెంట్లు వ్యాధులను దరిచేరనివ్వవు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. నరాలకు సంబంధించిన రోగాలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలను కూడా పుట్టగొడుగులు దూరం చేస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్ బి, సి, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ వంటి ధాతువులు వున్నాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 
 
ఆరోగ్య ప్రయోజనాలు..
శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్‌ను మష్రూమ్స్ తొలగిస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌తో హృద్రోగాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడుకు మేలు చేసే విటమిన్ బి అందిస్తుంది. మతిమరుపుకు చెక్ పెడుతుంది. మష్రూమ్స్‌ను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా రక్తపోటు తగ్గుతుంది. 
 
ఇక మహిళల్లో మోకాళ్ల నొప్పులు, గర్భాశయ సమస్యలు, రక్తనాళ్లాల్లో ఏర్పడే సమస్యలను సరిచేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఏర్పడే ప్రాణాంతక వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్‌ను మష్రూమ్స్ దూరం చేస్తాయి. అలాంటి మష్రూమ్స్‌ను మష్రూమ్ గ్రేవీ, పెప్పల్ చిల్లీ మష్రూమ్, మష్రూమ్ స్టఫింగ్, మష్రూమ్ ఎగ్ ఆమ్లెట్ అంటూ రకరకాలను తయారు చేసుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.