శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (18:12 IST)

జింబాబ్వేలో అవి ''too small'.. అందుకే ఎయిడ్స్ వస్తోందట..

జింబాబ్వేలో 1.3 మిలియన్ ప్రజలు ప్రాణాంతక హెచ్ఐవీతో బాధపడుతున్నారు. ఇందుకు ఆ దేశంలో లభించే చిన్నపాటి కండోమ్సే కారణమని తెలుస్తోంది. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఓ ప్రైవేట్ సెక్టార్ సాయంతో దీన్న

జింబాబ్వేలో 1.3 మిలియన్ ప్రజలు ప్రాణాంతక హెచ్ఐవీతో బాధపడుతున్నారు. ఇందుకు ఆ దేశంలో లభించే చిన్నపాటి కండోమ్సే కారణమని తెలుస్తోంది. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఓ ప్రైవేట్ సెక్టార్ సాయంతో దీన్ని ఈ సమస్యను పరిష్కరించే దిశగా కార్యాచరణ మొదలెట్టారు.

జింబాబ్వేలో శారీరక సంబంధాల ద్వారా హెచ్ఐవీ వ్యాపించడం అధికంగా వుందని.. ఈ వ్యాధిని నిరోధించేందుకు మార్కెట్లలో లభించే చిన్నపాటి కండోమ్స్‌పై ఫిర్యాదులు వస్తున్నట్లు జింబాబ్వే ఆరోగ్య శాఖా మంత్రి డేవిడ్ పెరిరెన్యత్వా తెలిపారు. 
 
ఈ చిన్నపాటి కండోమ్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. అయితే జింబాబ్వే ప్రైవేట్ సెక్టార్ సహాయంతో స్వదేశంలోనే కండోమ్స్ తయారీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. తద్వారా వినియోగదారులు కోరుకునే సైజుల్లో కండోమ్స్ తయారీకి రంగం సిద్ధం అవుతున్నట్లు డేవిడ్ చెప్పుకొచ్చారు.
 
కాగా, జింబాబ్వే గణాంకాల ప్రకారం 2016లో 109.4 మిలియన్ కండోమ్స్‌లను  చైనా నుంచి దిగుమతి చేసుకోగా.. ఒక వ్యక్తికి సంవత్సరానికి 33 కండోమ్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చేవి. దీంతో 2016లో 1.3 మిలియన్ ప్రజలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడి అయ్యింది.