సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (15:12 IST)

చేపల కంటి భాగాన్ని తింటున్నారా? పక్కనబెట్టేస్తున్నారా?

చేపల వంటకాలను డైట్‌లో చేర్చుకుంటారా? అయితే మీ కంటికి మీరు మేలు చేసినట్టేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ చేపలు తింటున్నప్పుడు వాటి ముళ్లను పక్కనబెట్టేస్తుంటాం. ఇంకా చేప కంటి భాగాన్ని ఎక్కువ మంది త

చేపల వంటకాలను డైట్‌లో చేర్చుకుంటారా? అయితే మీ కంటికి మీరు మేలు చేసినట్టేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ చేపలు తింటున్నప్పుడు వాటి ముళ్లను పక్కనబెట్టేస్తుంటాం. ఇంకా చేప కంటి భాగాన్ని ఎక్కువ మంది తీసుకోరు. అయితే చేపల కంటి భాగంలోనే కంటి దృష్టిని మెరుగుపరిచే పోషకాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
చేప కళ్లల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇంకా గుండెపోటు వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గుతాయి. ఇతరత్రా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా చేపల్లోని కళ్లను తొలగించకుండా వండుకుని తినడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది.
 
అందులోని విటమిన్ డి శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా టైప్-1 డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. అందుచేత ఇకపై చేపలు వండుకుని తినేటప్పుడు.. వాటి కళ్లను కూడా తినడం మంచిదని గుర్తుపెట్టుకోండి.