సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (11:57 IST)

ఖర్జూరాలు తప్పక తినాల్సిందే..

ఖర్జూరాలను రోజుకు రెండేసి తప్పక తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి

ఖర్జూరాలను రోజుకు రెండేసి తప్పక తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి మేలు చేస్తుంది. రోజూ వీటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కంటి దృష్టిలోపాలుండవు.
 
ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచేందుకు తోడ్పడతాయి. బక్కపలచగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది. 
 
ఇంకా కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. ఖర్జూరాలు ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. ఖర్జూరాలు జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.