కీరదోసను రోజూ తీసుకుంటే.. ఎంత మేలో తెలుసా?

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (12:16 IST)

ఎండాకాలంలో కీరదోసను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే.. కీరదోసలో దాదాపు తొంభైశాతం నీరుంటుంది. ఇది శరీర తాపాన్ని తగ్గించడంతో పాటు బరువును కూడా అదుపులో వుంచుతుంది. ఇందులోని సి విటమిన్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కీరదోసలో ఫొలేట్ వుండటం ద్వారా చర్మాన్ని తాజాగా వుంచుతుంది.
 
కీరదోసను నమలడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇందులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడును ఆరోగ్యంగా వుంచుతాయి. ఇంకా కీరదోసలో పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీరదోసను రోజూ తినడం ద్వారా శరీరంలోని టాక్సిన్లను తొలగించుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 
 
మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. మధుమేహం, కొలెస్ట్రాల్‌లను తగ్గించేందుకు కీరదోస ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బీపీ కూడా అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

క్యాల్షియం టాబ్లెట్లు కాదు... ఇవి తింటే ఎముకలు బలంగా...

ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి క్యాల్షియం ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎముకల పటుత్వానికి, ...

news

చుక్కేయనిదే నిద్రపట్టట్లేదా? ఐతే ఇవన్నీ తప్పవండోయ్

మందుకొట్టలేకుండా వుండలేకపోతున్నారా? చుక్కేయనిదే.. నిద్రపట్టడం లేదా? అయితే మానసిక సంబంధిత ...

news

క్యారెట్‌ను వంటల్లో కాదు.. ఇలా ట్రై చేసి చూడండి..

క్యారెట్‌ను వంటల్లో చేర్చుకుంటుంటారు. అయితే క్యారెట్‌ను ఉడికించకుండా పచ్చిగా తీసుకోవడం ...

news

వేసవిలో సబ్జా గింజలను కొబ్బరి నీటిలో నానబెట్టి తాగితే?

వేసవిలో సబ్జా గింజలను కొబ్బరి నీటిలో నానబెట్టి తాగితే...శరీర తాపం తగ్గిపోతుంది. సబ్జా ...