శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:57 IST)

రోజంతా చలాకీగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు?

ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు రకరకాల వ్యవహారాలను చక్కదిద్దాల్సి ఉంటుంది. అందుకుని రోజంతా అలసిపోకుండా చలాకీగా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే రోజంతా చలాకీగా ఉంటుంది. ప్రతిరోజూ సాధ్యమైనంత వరకు పచ్చి కూరలు తినాలి. పండ్ల రసాలు తాగితే శరీరానికి మంచిది. ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా ఉండాలి. స్వీట్లు ఎక్కువ తినకూడదు.
 
బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజీ, కాకర వంటి వాటిలో ఏదో ఒకదాన్ని జ్యూస్‌గా తీసుకుని తాగితే మేని కాంతి పెరుగుతుంది. పగలైనా రాత్రయినా ఎప్పడూ ఓ నిర్ణీత సమయంలో భోజనం చేయడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పడుకునే ముందు గ్లాసు పాలలో తేనె వేసుకుని కానీ, పండు కానీ తింటే మాయిగా నిద్రపడుతుందంటున్నారు.