శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (17:07 IST)

15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ఈ రెండింటి కోసం గంటలు గంటలు వృధా చేస్తున్నారు జనం. ఇంకా ఇయర్ ఫోన్స్‌ను చెవుల్లో పెట్టుకుని గంటల సేపు స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్నారు చాలామంది. అలాంటి వారు మీరైతే ఈ కథనం చదవాల్సిందే. 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడకూడదని.. అలా వాడాల్సి వస్తే మధ్య మధ్యలో కొంత బ్రేక్ ఇవ్వడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే, వినికిడి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయని వారు చెప్తున్నారు. 
 
ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం ద్వారా వినికిడి శ‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోయి చివ‌ర‌కు చెవుడు వ‌స్తుంద‌ట‌. అలాగే మెద‌డు పనితీరు మంద‌గిస్తుంద‌ట‌. యాక్టివ్‌గా ఉండ‌లేర‌ట‌. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గుతుంద‌ట‌. ఇక చాలామంది ఇయ‌ర్‌ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండ‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని, అది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వైద్యులు సూచిస్తున్నారు.