గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (15:31 IST)

కాలేయం పువ్వు లాంటిది.. రాత్రి 8 గంటలకు తర్వాత భోజనం చేశారో?

ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు తర్వాత తీసుకునే ఆహారం కాలేయానికి ఇబ్బందిని తెచ్చ

ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు తర్వాత తీసుకునే ఆహారం కాలేయానికి ఇబ్బందిని తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలేయం ఓ పువ్వులాంటిదని... లేటుగా ఆహారం తీసుకుంటే పువ్వులాంటి కాలేయం దెబ్బతింటుందని.. తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఒక వేళ ఎనిమిది గంటలకు తర్వాత ఆకలేస్తే ఓ రెండు అరటి పండ్లు పాలు తీసుకుని నిద్రించాలే తప్ప.. 8 గంటలకు తర్వాత ఫుల్ మీల్స్ లాగిస్తే మాత్రం కాలేయానికి ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట అల్పాహారాన్ని 8.30 గంటల్లోపు, మధ్యాహ్నం పూట భోజనాన్ని ఒంటి గంటలోపు పూర్తి చేయడం ద్వారా బరువు పెరగరు.
 
ఇంకా గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగమైతే తప్పకుండా గంటపాటు వ్యాయామం చేయాల్సిందేనని.. అలాకాకుంటే ఒబిసిటీ, మధుమేహం వంటి వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే రాత్రి పూట లేకుంటే తరచు వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలని, రాత్రి ఆహారంలో యాభై శాతం పచ్చి కూరగాయలు, పళ్లు తీసుకోవాలి. ఇంకా అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టెలు తీసుకోవడం ఉత్తమమని, ఉప్పు, పంచదార మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.