గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (10:09 IST)

వెల్లుల్లి రెబ్బలను తింటే లైంగిక ఆరోగ్యం భేష్...

వెల్లుల్లిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సర్జరీ చేయించుకోవాలని అనుకునే వారు వెల్లుల్లిని సర్జరీకి రెండు వారాల ముందు నుండే తీసుక

వెల్లుల్లిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సర్జరీ చేయించుకోవాలని అనుకునే వారు వెల్లుల్లిని సర్జరీకి రెండు వారాల ముందు నుండే తీసుకోవడం మానేయాలి. ఇలా చేయకపోతే రక్తస్రావం అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే తక్కువ రక్తపోటుతో బాధపడే వారు కూడా తినకూడదు. వెల్లుల్లిలో రక్తపోటును తగ్గించే గుణం ఉంటుంది. 
 
రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే బరువు తగ్గుతారు. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. 
 
రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు. వెల్లుల్లి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.