శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (15:44 IST)

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత పాలు తీసుకుంటే..?

షుగర్ వ్యాధి గల వారు పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ అభిప్రాయంపై స్పందించిన పరిశోధకులు దీని గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత పాలు తీస

షుగర్ వ్యాధి గల వారు పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ అభిప్రాయంపై స్పందించిన పరిశోధకులు దీని గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత పాలు తీసుకున్నట్లైతే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గి షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అల్పాహారం సమయంలో ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన పాలు.. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. తృణ ధాన్యాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్న తరువాత నీటికి బదులుగా పాలు తీసుకున్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని పరిశోధనలో వెల్లడైంది. కనుక తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ తరువాత పాలు తీసుకున్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది.