అల్పాహారంలో ఆ ఐదు తప్పకుండా వుండాలట.. (video)
ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే అందుకు ఎలాంటి పద్ధతులను పాటించాలన్నదే ముఖ్యం. చాలామంది ఉదయం వేళ హడావుడిగా తినేశాం అనిపిస్తుంటారు కానీ అల్పాహారంలో ముఖ్యంగా ఐదింటిని భాగం చేసుకోవాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రోజూ మనం తీసుకునే ఆహారంలో అల్పాహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అల్పాహారానికి బ్రేక్ ఇవ్వడం, ఫాస్టింగ్ అంటూ వదిలిపెట్టేయడం చేయకూడదు. అలాచేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని.. తీసుకునే ఆహారంలో అధిక ప్రోటీన్లు వుండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందుకే అల్పాహారంలో అధిక ప్రోటీన్లు వున్న ఆహారాన్ని తీసుకోవాలి.
అల్పాహారంలో అధిక ప్రోటీన్లు వుంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు సరిగ్గా వుంటాయి. తద్వారా మధుమేహం చెంతకు చేరదు. ఇంకా బరువు సులభంగా బరువు తగ్గుతారు. శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఒబిసిటీకి చోటే వుండదు. అందుచేత అధిక ప్రోటీన్లు కలిగిన కోడిగుడ్లు, ఓట్స్, నట్స్, పాలు, పండ్లు అల్పాహారంలో తప్పక వుండేలా చూసుకోవాలి.
ముందుగా కోడిగుడ్లు- రోజూ అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకుంటే శరీరానికి సరిపడా శక్తి లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. ఇందులో ఫ్యాట్ సాల్యూబల్ విటమిన్స్ వుంటాయి. తద్వారా బరువు తగ్గొచ్చు. అందుకే ఉదయం పూట ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోసె వంటివి అల్పాహారంగా తీసుకోవాలి.
అలాగే ఓట్స్ - ఓట్స్‌లో హై ప్రోటీన్లు లేకపోయినా.. ఓట్స్‌లో ఫైబర్ రిచ్‌గా వుంటుంది. ఫైబర్ ఎక్కువగా వుండే వోట్స్‌ను అల్పాహారంగా తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది. ఇది అధికంగా ఆహారం తీసుకోనీయదు. తీసుకున్న ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. వోట్స్‌ను తీసుకుంటే కడుపు నిండినట్లుంది.
ఇకపోతే.. నట్స్ సంగతికి వస్తే బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ ఉదయం పూట తప్పక తీసుకోవాలి. ఇందులోని ప్రోటీన్లు, ఓమెగా-త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. గుండెను, మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. రోజుకు గుప్పెడు.. అదీ అల్పాహారంలో నట్స్‌ను తీసుకుంటే.. బరువు ఏమాత్రం పెరగరు.
అదేవిధంగా పాలు.. పాలను రోజూ అల్పాహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. ఇందులోని విటమిన్ బీ3.. బరువును నియంత్రిస్తుంది. తాజాగా నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో పాలను తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చునని తేలింది.
పండ్లు- రోజూ అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. బరువు పెరగడం ద్వారా మధుమేహం లాంటి రుగ్మతలు వెన్నంటి వస్తాయి. ఫలితంగా జామకాయలు, అవకోడా, ఆప్రికాట్స్, కివి ఫ్రూట్స్, అరటి పండ్లతో సలాడ్‌లా అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కాబట్టి ఈ పదార్థాలను అల్పాహారంలో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.